అమరావతి : ఏపీలో వరద బాధితులకు అందించిన సహాయంపై వైసీపీ(YCP) నాయకులు చేస్తున్న ఆరోపణలను టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభిరామ్ (TDP leader Pattabhiram ) తీవ్రంగా ఖండించారు. కొవ్వొత్తులకే రూ.23 కోట్లు, భోజనాలకు రూ. 368 కోట్లు ఖర్చు పెట్టారనే ఆరోపణలపై ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
కష్టాల్లో ఉన్న పేదలను ఏనాడైన ఆదుకున్నారా అంటూ వైఎస్ జగన్‌ను(YS Jagan) ప్రశ్నించారు. వైసీపీ హయాంలో వచ్చిన వరదల్లో బాధితులను కనీసం పలకరించినా పాపాన పోలేదని విమర్శించారు. ఎగ్‌పఫ్(Eggpups) ల కోసం రూ. 3.50 కోట్లు ఖర్చు చేసిన మీరు మమ్ములను విమర్శించేది అంటూ నిలదీశారు. బుడమనేరు వరదల వల్ల బాధితుల కోసం వివిధ వాటికి ఖర్చు పెట్టిన లెక్కలను ప్రకటించారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రకటనలకు ఆయన సమాధానమిచ్చారు.
సానిటేషన్‌కు (Sanitations) కోసం ప్రభుత్వం రూ. 18,34 కోట్లు ఖర్చు పెడితే రూ. 51 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించడం మంచినీటి బాటిళ్లకు రూ. 11 కోట్లు పెడితే రూ. 21 కోట్లు అని, భోజనాలకు రూ. 57.4 కోట్లు అయితే రూ. 368 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం నిజాయితీగా చివరి అంకె వరకు లెక్క చెబుతుందని వెల్లడించారు.
సచివాలయాలకు రూ. 3, 500 కోట్లు , సర్వే రాళ్లపైన జగన్ బొమ్మ వేసుకోవడానికి రూ. 300 కోట్లు, రిషికొండ ప్యాలెస్‌కు రూ. 600 కోట్లు, సొంత పత్రికలో ప్రకటన కోసం రూ. 500 కోట్లు , పట్టాపాసు పుస్తకాల కోసం బొమ్మవేసుకోవడానికి రూ. 13 కోట్లు , తాడేపల్లి ప్యాలెస్‌లో సౌకర్యాల కోసం రూ. 15 కోట్లు మొత్తం విలాసవంతం కోసం రూ.4,800 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వరదల సహాయం కోసం సీఎం సహాయ నిధికి వైసీపీ ప్రకటించిన రూ. కోటి ఎక్కడా అంటూ ప్రశ్నించారు.