బెంగళూరు : జూనియర్ డాక్టర్ పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఓ సీనియర్ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిఫ్ట్‌లో ఆమెకు ముద్దు ఇవ్వడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో జనవరి 12న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎంబీబీఎస్ పూర్తయిన ఓ విద్యార్థిని హసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. జనవరి 12న తన విధులు ముగించుకున్న జూనియర్ డాక్టర్ లిఫ్ట్‌లో వస్తుండగా.. అదే లిఫ్ట్‌లో ఉన్న సీనియర్ డాక్టర్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూనియర్‌కు సీనియర్ ముద్దు ఇచ్చాడు. దీంతో ఆమె మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన యాజమాన్యం సీనియర్ డాక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.