హర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సెహరి’. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సెహరి’ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చిందని, కొత్త జంట హర్ష్, సిమ్రాన్ మెప్పిస్తారని, యువతకు నచ్చే అన్ని అంశాలతో వినోదాత్మకంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు చెబుతున్నారు. అభినవ్ గోమటం, ప్రణీత్ రెడ్డి, కోటి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – ప్రశాంత్ ఆర్ విహారి, ఎడిటర్ – రవితేజ గిరిజాల, ఆర్ట్ సాహి సురేష్.