లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాతలు. నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. రితేష్ రానా దర్శకుడు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శుక్రవారం నటుడు సత్య పుట్టినరోజు సందర్భంగా అతని లుక్తో పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ నవ్వించేలా ఉంది. ‘ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నామనీ, ఫిక్షనల్ ప్రపంచంలో సాగే ఈ సినిమా సరికొత్త పాత్రలతో, మాటలతో ఆకట్టుకుంటుందని’ చెబుతున్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : కాలభైరవ, సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం.