ఎడిన్బర్గ్: స్కాట్లాండ్కు చెందిన ఓ రాజకీయ నాయకుడు విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. స్వలింగులు పెళ్లి చేసుకోవడం వల్లే కరోనా వైరస్ వచ్చిందని స్కాట్లాండ్కు చెందిన స్వతంత్ర అభ్యర్థి పీటర్ టెయిట్ వాదిస్తున్నారు. షెట్లాండ్ టైమ్స్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకున్న మత సంబంధమైన విశ్వాసాల కారణంగానే తాను ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు టెయిట్ చెప్పారు. తన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తుందన్న విషయం కూడా తనకు తెలుసని ఈ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం. 2019లో స్కాట్లాండ్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పది అభ్యర్థుల్లో టెయిట్ చివరి స్థానానికి పరిమితమై దారుణంగా ఓడిపోయారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన టెయిట్పై ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అతడో ఇడియట్ అని వాళ్లు అంటున్నారు. స్వలింగులు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే కరోనా వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఇవి గేలపై ద్వేషాన్ని పెంచి పోషించేలా ఉన్నాయని వాళ్లు మండిపడ్డారు. గే పెళ్లిళ్ల వల్లే కరోనా వచ్చిందన్న ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలోనూ ఉక్రెయిన్‌కు చెందిన చర్చి ఫాదర్ పాట్రియార్క్ ఫిలారెట్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఇవికూడా చదవండి..
హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో