Pawan Kalyan | OG సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, మొదటి రోజే రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా మాత్రమే కాకుండా తండ్రిగా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో తండ్రి–కూతురు మధ్య నడిచిన ఎమోషనల్ ట్రాక్‌కు విశేషంగా స్పందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక పవన్ కి కూతురిగా నటించిన చిన్నారి పాప గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి కూతురిగా నటించిన చిట్టి పాప పేరు సాయేషా షా అని తెలిసింది.
ముంబైకి చెందిన ఈ చిన్నారి ఇప్పటికే అనేక యాడ్స్ లో నటించి మంచి అనుభవం సంపాదించింది. డెటాల్, సంతూర్, లెన్స్ కార్ట్, టాజెల్, యూరో కిడ్స్, ఇతర రియల్ ఎస్టేట్ యాడ్స్ లో బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి కనిపించింది. ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ తో కూడిన ఓ యాడ్ లోనూ ఈ పాప నటించింది.OG సినిమానే సాయేషాకు మొదటి సినిమా కావడం విశేషం. ఓ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – సాయేషా మధ్య తండ్రి-కూతురు సెంటిమెంట్ బాగా కుదిరింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో సాయేషా నటన అందరినీ కదిలిస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ స్టార్ సరసన నటించిన తొలి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెకు ఇప్పటికే మంచి గుర్తింపు లభించింది.
OG సినిమాలో నటించిన అర్జున్ దాస్, రాజ్ తిరందాస్ లతో కలిసి సాయేషా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో ఇప్పటికే షేర్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అభిమానులు ఆ ఫోటో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పవన్‌తో దిగిన ఫోటోను సాయేషా షేర్ చేస్తే, అది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం. OG సినిమాలో తన అమాయక నటనతో అభిమానుల మనసు గెలుచుకున్న సాయేషా షా కి, ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలెంట్ ఉండాలంటే ఆమెలా ఉండాలి అంటున్నారు నెటిజన్లు.ఇకపోతే OG సినిమాతోనే చిన్నారి సాయేషా సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ పాప టాలెంట్‌ను మరిన్ని దర్శకులు గుర్తించి మంచి ఛాన్సులు ఇస్తారని ఆశిద్దాం.