Allu Sirish | తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత గుర్తింపు పొందిన కుటుంబాల్లో అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య వేసిన పునాదులపై నిర్మాణాత్మకంగా ఎదిగిన ఈ కుటుంబాన్ని, ఆయన కుమారుడు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్‌గా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అల్లు అరవింద్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతుండగా, మూడో కుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, అల్లు శిరీష్‌కు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం నిశ్చయమైనట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. శుభకార్యానికి ఏర్పాట్లు జరుపుతున్న సమయంలనే , అల్లు రామలింగయ్య సతీమణి, శిరీష్ బామ్మ అయిన కనకరత్నమ్మ మరణంతో పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే అల్లు శిరీష్ నిశ్చితార్థానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం. పెళ్లి కూడా ఎంతో గ్రాండ్‌గా, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా శిరీష్‌కి అంతగా విజయం దక్కకపోయినప్పటికీ, ఈ శుభవార్త ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త శుభారంభానికి దారి చూపనుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా, శిరీష్ వాటిని ఖండిస్తూ, తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఈ పెళ్లి శుభవార్తతో అల్లు ఫ్యామిలీ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోతున్నారు. త్వరలోనే శిరీష్ వివాహానికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా వెలువడనుంది. ఇక శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాల్లో నటించినా అల్లు ఫ్యామిలీ రేంజ్ విజయాల దక్కించుకోలేకపోయాడు. చివరిగా ‘టెడ్డీ’ చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి నిరాశపరిచాడు. యాక్టింగ్ పరంగా మెరుగైనా కథల ఎంపికలో పొరపాట్ల వల్లే శిరీష్ కెరీర్ఇం దెబ్డ తింటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.