SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Saudi Arabia | సౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల తమిళ యువ ఇంజినీర్ అనోజన్ శివరాసా ఎదుర్కొంటున్న ఉరిశిక్షను సౌదీ ప్రభుత్వం రద్దు చేసింది.
Saudi Arabia | సౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల తమిళ యువ ఇంజినీర్ అనోజన్ శివరాసా ఎదుర్కొంటున్న ఉరిశిక్షను సౌదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి సౌదీ అరేబియా సుప్రీంకోర్టు అతని మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
శ్రీలంకకు చెందిన అనోజన్ శివరాసా సౌదీ అరేబియాలోని ఓ ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోపై స్పందిస్తూ అతను ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టాడు. అయితే ఈ వ్యాఖ్యలపై మతపరమైన వివాదం చెలరేగడంతో, భయపడిన అనోజన్ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేయడంతో పాటు క్షమాపణ కూడా కోరాడు. అయినప్పటికీ కొందరు దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను సేకరించి సౌదీలోని అతని యాజమాన్యానికి పంపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సౌదీ సైబర్ క్రైమ్ చట్టం కింద మొదట అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు.
అయితే ఈ కేసు అక్కడితో ఆగలేదు. ప్రాసిక్యూటర్లు దీనిని కేవలం సైబర్ నేరంగా పరిగణించలేమని వాదిస్తూ, షరియా చట్టం కింద విచారణ జరపాలని కోరడంతో అప్పీలేట్ కోర్టు అతని సాధారణ జైలు శిక్షను కాస్తా మరణశిక్షగా మార్చింది. ఈ ఊహించని తీర్పుతో శ్రీలంకలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అనోజన్ కుటుంబ సభ్యులు, పలు మానవ హక్కుల సంఘాలు అతన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన దౌత్యపరమైన ప్రయత్నాలు, న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించాయి. సౌదీ సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరిస్తూ అనోజన్ మరణశిక్షను రద్దు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

