Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Mary Millben: అమెరికాలోని దాతలు భారీగా సీజేపీకి విరాళాలు ఇస్తున్నట్లు అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఆరోపించారు. దేశంలోని చదువుకున్న యువత .. ఆ విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధాని మోదీని ఓడించేందుకు ఫండింగ్ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ: ఇండియాలోని కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికాలో ఉన్న దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నట్లు అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఆరోపించారు. సైలెంట్‌గా ఉండాల్సిన సమయం ఇది కాదు అని, విఛ్ఛిన్నకర స్పూర్తిని ఢీకొట్టేందుకు దేశంలోని యువత శాంతియుత నిరసన చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలతో పాటు సీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మిల్బెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నేత అభిజీత్ దీప్కేతో పాటు అతని పార్టీకి అమెరికన్లు విరాళాలు ఇస్తున్నారని, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆ విరాళాలను అందిస్తున్నారని అమెరికన్ సింగర్ మిల్బెన్ తెలిపారు.
ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన సమయం కాదు అని, అందమైన దేశ యువత శాంతియుత రీతిలో విచ్ఛిన్నకర శక్తులతో పోరాడాలన్నారు. యువ దేశభక్తులారా, భయం వద్దు, మీ ప్రధాని.. భారత్‌కు 25 ఏళ్లు సేవ చేశారని, 12 ఏళ్లు ప్రధానిగా వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారని, విచ్చిన్నకర శక్తులకు ఆయన తలొగ్గరన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాతలకు ఓ ప్రత్యేక విధానం ఉంటుందని, ఎక్కడైనా కన్జర్వేటివ్ నేతల్ని టార్గెట్ చేస్తారని, అమెరికాలో చదువుకున్న వ్యక్తులను గుర్తించి, వారిని ర్యాడికలైజ్ చేసి, ఆయా దేశాలకు పంపిస్తారని, ఇక గందరగోళం, విధ్వంసం సృష్టించేందుకు ఫండింగ్ చేస్తారని, కానీ ఇప్పటి వరకు ఎవరూ సక్సెస్ కాలేదని, కానీ వాళ్లు అభివృద్ధికి, పరిపాలనకు అడ్డుపడుతుంటారని మిల్బెన్ తెలిపారు.
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ఉన్నతంగా నిలిపేందుకు కౌంటర్‌గా ఓ ఉద్యమం అవసరం అవుతుందని అమెరికన్ సింగర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొత్త గళం ఉద్భవించాలని, ఈనేలలో చదివిన వ్యక్తులు ముందుకు రావాలని, కాక్రోచ్ జనతా పార్టీ విచ్చిన్నర స్పూర్తిని శాంతియుతంగా దెబ్బతీయాలని, దీని కోసం ఈ దేశ యువత మేలుకోవాలని ఆమె అన్నారు.
ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మిలిబెన్ ఇటీవల ఇండియాలో ఫేమస్ అయ్యారు. భారత జాతీయ గీతంతో పాటు ఓం జై జగదీశ హరే పాటలను ఆమె పాడారు. 2023లో ప్రధాని మోదీ అమెరికాలో టూర్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో మిలిబెన్ జనగణమణ పాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

