న్యూయార్క్: సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు సాధారణంగా కనిపిస్తాయి. శనిగ్రహం చుట్టూ మాత్రం కొన్ని వలయాలు కనిపిస్తాయి. అయితే, త్వరలో ఈ వలయాలు కనుమరుగు అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి నుంచి చూసే వారికి 2025 మార్చి నాటికి శనిగ్రహం చుట్టూ ఎలాంటి వలయాలు కనిపించవని తెలిపారు. మూడు దశాబ్దాలకు ఒకసారి జరిగిన ఖగోళ మార్పు వల్ల ఈ వలయాలు కనిపించకుండా పోతాయని చెప్పారు. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో శనిగ్రహం 26.7 డిగ్రీల అక్షీయ వంపు తీసుకుంటున్నందున భూమి నుంచి శనిగ్రహం చుట్టూ వలయాలు కనిపించబోవని తెలిపారు. అయితే, ఇది తాత్కాలికమేనని, 2025 మార్చి తర్వాత కొన్ని రోజులకు మళ్లీ క్రమంగా కనిపించడం ప్రారంభం అవుతుందని తెలిపారు.