Sasivadane Trailer | రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా రూపొందుతున్న ఫీల్‌గుడ్ వింటేజ్ విలేజ్ లవ్‌స్టోరీ ‘శశివదనే’. ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలే పెంచాయి. సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోదాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుండగా, ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఈ క్రమంలో మూవీ నుండి ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చాలా హృద్యంగా, ఆసక్తికరంగా ఉంది. ఒక్క చూపుతో ప్రేమ మొదలైందని హీరో రక్షిత్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ మొదలు కాగా, చివరలో ప్రేమతో వెళతున్నా, వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దాం.. అనే డైలాగ్ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్‌ని చూస్తే తెలుస్తుంది.
ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాను రూపొందించామని, అనుదీప్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలమని, విజువల్‌గా కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా, సమర్పణ: గౌరీనాయుడు, నిర్మాణం: ఏజీ ఫిల్మ్ కంపెనీ.