హైదరాబాద్ : ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ వాసుల కోసం నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీనటి సోనియా సింగ్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని చాటిన ఈ ముంబై ఫేమస్ ఫాబ్రిక్ బ్రాండ్.. ఇక సౌత్ ఇండియా అంతటా తన డిజైనర్ మార్కెట్‌ను విస్తరించనుంది. సరోజ్ ఫ్యాబ్రిక్స్ దేశవ్యాప్తంగా వివిధ పెద్ద ఫ్యాషన్ హౌస్‌లు, సెలబ్రిటీల ఫ్యాషన్ డిజైనర్లు, రన్‌వే షోలు, ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ వీక్‌లకు ఒక సొల్యూషన్‌లా ఉంది.
హైదరాబాద్ నగరంలో ‘సరోజ్ ఫ్యాబ్రిక్స్’ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని సినీనటి సోనియా సింగ్ అన్నారు. ఇది కేవలం ఫాబ్రిక్ కాదని, ఇది మీ వాలెట్లలో సులభంగా ఉండే విలాసవంతమైన డిజైనర్ ఫ్యాబ్రిక్ అని పేర్కొన్నారు. అన్ని డిజైనర్ అవసరాలకు ఇది వన్-స్టాప్ సొల్యూషన్ అని చెప్పారు. స్టైలింగ్ నుంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్, అన్స్టిచ్డ్ సూట్లు, దుపట్టాల వరకు అన్నీ ఇక్కడ కవర్ చేయబడ్డాయన్నారు.
సరోజ్ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ అశోక్ మోడీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అత్యుత్తమ ఫ్యాబ్రిక్స్ అనుభవాన్ని అందించడంపట్ల తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ఫ్యాబ్రిక్స్ షోరూమ్ డిజైనర్లకు ఒక వరమవుతుందన్నారు. పెళ్లి, రోజువారీ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ల కోసం ఈ స్టోర్ ను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దామని చెప్పారు. దాదాపు 50 సంవత్సరాలుగా సరోజ్ ఫ్యాబ్రిక్స్.. ఫ్యాషన్ డిజైనర్లు, సినిమాలు, సీరియల్స్, ఎగుమతిదారులు, బోటిక్ యజమానులు, ఫ్యాషన్ పరిశ్రమకు అత్యుత్తమ నాణ్యతగల బట్టలను సరఫరా చేసి నమ్మకాన్ని సంపాదించుకుందని తెలిపారు.
ఫ్యాన్సీ సిల్క్ల నుంచి క్లాసీ లినెన్ల వరకు, అందమైన ప్రింట్ల నుంచి సున్నితమైన ఎంబ్రాయిడరీల వరకు బంజారాహిల్స్ స్టోర్‌లో ఉన్నాయన్నారు. పెళ్లి దుస్తులు, రోజువారీ దుస్తులకు అవసరమైన అన్ని వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇవే కాకుండా కుర్తాలు, షేర్వానీలు, జాకెట్ల కోసం వరుడికి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన దుస్తుల కోసం బ్రోకేడ్లు, సిల్క్స్, వెల్వెట్లు లాంటి ఫ్యాబ్రిక్లను ఎంచుకునే అవకాశం ఉందన్నారు.