Sanju Samson | వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో సంజూ శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలంటూ డిమాండ్
Sanju Samson | టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన నిలకడలేని ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆశ్చర్యపరచడం, ఆ వెంటనే వరుస వైఫల్యాలతో నిరాశపరచడం సంజూ కెరీర్లో తరచూ కనిపించే అంశమే. తాజాగా కూడా అదే పరిస్థితి పునరావృతం కావడంతో అతని జట్టులో స్థానం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Sanju Samson | టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన నిలకడలేని ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆశ్చర్యపరచడం, ఆ వెంటనే వరుస వైఫల్యాలతో నిరాశపరచడం సంజూ కెరీర్లో తరచూ కనిపించే అంశమే. తాజాగా కూడా అదే పరిస్థితి పునరావృతం కావడంతో అతని జట్టులో స్థానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సంజూ శాంసన్‌కు భారత జట్టులో రెగ్యులర్ అవకాశాలు లభించాయి. ఆరంభంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాది తన సత్తా చాటాడు. అయితే ఆ తర్వాత మళ్లీ నిలకడ కోల్పోయినా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో జట్టులో కొనసాగాడు.
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభంలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డ సంజూపై విమర్శలు వచ్చినా, టోర్నమెంట్ కీలక దశలో అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. సూపర్-8లో వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు కీలక విజయం అందించిన సంజూ, సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులతో మెరిశాడు. అనంతరం ఫైనల్లో న్యూజిలాండ్‌పై మరో 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో తొలిసారిగా వరుసగా మూడు కీలక మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసి, బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
అయితే ప్రపంచకప్‌లో మెరిసిన సంజూ, ఆ తర్వాత మళ్లీ ఫామ్ కోల్పోయాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో వరుసగా 5 పరుగులు, డకౌట్‌తో నిరాశపరిచాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా కేవలం ఒకే పరుగు చేసి ఔటయ్యాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఇబ్బంది పడిన సంజూ, ఏడు బంతులు ఎదుర్కొని పెవిలియన్ చేరాడు.ఈ వరుస వైఫల్యాల తర్వాత అతని జట్టులో స్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతుండటంతో, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా కోరుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే టీ20 ప్రపంచకప్‌లో సంజూ ఆడిన కీలక ఇన్నింగ్స్‌లను దృష్టిలో పెట్టుకుని జట్టు యాజమాన్యం ఇంకా అతనిపై నమ్మకం ఉంచినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

