బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా సిరీస్ ‘మున్నాభాయ్’. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన ఈ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. మున్నాభాయ్ సిరీస్‌లో రెండు చిత్రాలు ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’,‘లగేరహో మున్నాభాయ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సిరీస్‌లో మూడో సినిమా చేయాలని సంజయ్‌దత్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ అనుకుంటున్నారట. ఇటీవల సంజయ్‌దత్‌ను అభిమానులు మున్నాభాయ్ మూడో చిత్రం గురించి అడిగారు. సంజయ్‌దత్ మాట్లాడుతూ…‘ఆ సినిమా చేయాలని నాకూ కోరికే. నేనూ, రాజ్హిరాణీ కలిసి ఆ తర్వాత ‘పీకే’ సినిమా చేశాం. మూడో సినిమా ఎప్పుడనేది మీరు దర్శకుడినే అడగాలి’ అన్నారు.