నిఖిల్ విజయేంద్ర సింహ, తేజు అశ్విని జంటగా నటిస్తున్న ‘సంగీత్’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాద్‌ఖాన్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.కార్తికేయ క్లాప్‌నివ్వగా, శౌర్య కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లి సమయంలో ఓ కుటుంబంలో జరిగిన సంఘటనలను వినోదాత్మకంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కామెడీతో పాటు కుటుంబ అనుబంధాలు ప్రధానంగా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను సమర్థ్ అనే యువకుడి పాత్రలో కనిపిస్తానని, తన హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిదని హీరో నిఖిల్ విజయేంద్ర సింహా తెలిపారు. విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్ష చెముడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ నాయక్, నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, ఆర్.బి.స్టూడియోస్, నిర్మాతలు: నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్, రచన-దర్శకత్వం: సాద్‌ఖాన్.