
అగ్ర కథానాయిక సమంత ఇటీవలకాలంలో సోషల్‌మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు ఆశనిరాశల మధ్య ఊగిసలాటను ప్రతిబింబిస్తూ తాత్వికధోరణిలో ఉంటున్నాయి. ఇటీవలే హిమాలయాల్లో చార్ధామ్ యాత్రను పూర్తిచేసుకొని వచ్చిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తున్నది. మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుందనే అంశం గురించి తెలియజేస్తూ ఓ రచయిత కొటేషన్‌ను పోస్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే మనిషి అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే వారిలోని నిగూఢమైన స్వభావం తెలిసివస్తుంది’ అంటూ రాసివున్న కోట్ అభిమానులతో పంచుకుంది సమంత. అయితే ఈ మాటలవెనకున్న అంతరార్థం ఏమిటన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు స్నేహితులతో కలిసి దుబాయ్‌లో విహరిస్తున్నది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ఆధ్యాత్మిక, విహార యాత్రల్లో బిజీగా గడుపుతున్నది.