టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఫిట్ నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టే భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది సమంత (Samantha). ఈ బ్యూటీ తన డైలీ టేం టేబుల్లో ఫిట్నెస్ సెషన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటుంది. ట్రైనర్ జునైద్ షేఖ్ (Junaid Shaikh) సాయంతో కష్టతరమైన వర్కవుట్స్ ను కూడా అత్యంత సులభంగా చేసేస్తుంది. హార్డ్ వర్క్ కూడా అవలీలగా చేస్తూ ఎంతో మంది ఫాలోవర్లు, ఫిట్ నెస్ లవర్లలో స్పూర్తి నింపుతుంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఓ వీడియో షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సామ్ బాడీ మొబిలిటీని అంచనా వేసేందుకు నాగిన్ మొబిలిటీ డ్రిల్ (Nagin Mobility Drill)ను చేయించాడు. కర్రను పట్టుకుని సామ్ వైపు డిఫరెంట్ యాంగిల్స్ లో చూపిస్తుంటే..ఆ కర్ర టచ్ కాకుండా ప్రయత్నిస్తోంది. నాగిన్ మొబిలిటీ డ్రిల్‌తో సమంత సూపర్ ఫిట్‌గా ఉందని ఫైనల్‌గా ఓ నిర్దారణకు వచ్చాడు జునైద్ షేఖ్. నా ట్రైనర్ మీ కన్నా చాలా క్రేజీయెస్ట్ అంటూ సామ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.