హైదరాబాద్, మార్చి 29: ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంటనూనెలు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న అదానీ విల్మార్ లిమిటెడ్ ప్రచారకర్తగా సమంతను నియమించుకున్నది. ఇందుకు సంబంధించి సమంత నటించిన టీవీ కమర్షియల్ యాడ్‌ను విడుదల చేశారు. దక్షిణ ఫిల్డ్ ఇండస్ట్రీలో ప్రజాదరణ పొందిన సమంతతో దక్షిణాది మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి వీలు పడనున్నదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ముకేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.210గా ఉన్నది.