తిరుమల : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) ఈనెల 21 తిరుమల ( Tirumala) లో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నవంబరు 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.