Salman Khan Dashing Look | బాలీవుడ్ కండలవీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 59 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలకు పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన కొన్ని స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సల్మాన్ షర్ట్ లేకుండా తన టోన్డ్ బాడీని చూపిస్తూ చాలా డాషింగ్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలకు ఆయన పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అందాజ్ అప్నా అప్నా’లోని పాటల సాహిత్యాన్ని ఆయన క్యాప్షన్‌గా ఉపయోగించారు. “యే లో జీ సనమ్ హమ్ ఆ గయే… అబ్ ఇత్నా భీ గుస్సా కరో నహీ జాణీ” (ఇదిగో జీ, సనమ్, మేము వచ్చేశాము… ఇకపై అంత కోపం తెచ్చుకోకు జానీ)అంటూ ఆయన అభిమానులను అలరించారు.
‘అందాజ్ అప్నా అప్నా’ చిత్రం ఇటీవల మళ్లీ థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా సల్మాన్ తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తారు. ఈ వయస్సులోనూ ఆయన తన శరీరాకృతిని కాపాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆయన ఫిట్నెస్ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. “59 ఏళ్లలోనూ ఇంత డాషింగ్‌గా ఉండటం కేవలం సల్మాన్‌కే సాధ్యం”, “భాయ్‌జాన్ ఎప్పటికీ యంగే” అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటించింది.
Eello ji sanam hum aa gaye………….
Ab itna bhi gussa karo nahin jaani pic.twitter.com/QCo2OJUAGs— Salman Khan (@BeingSalmanKhan) April 28, 2025