అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి వెల్లడించారు. సినిమా సెట్లో సల్మాన్ రాగానే చిరంజీవి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ…‘భాయ్, సల్మాన్ ఖాన్కు స్వాగతం. మీ రాక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మీతో తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. మీరు సినిమాలో కనిపిస్తే చాలు ప్రేక్షకులకు కిక్ వస్తుంది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతున్నది. నయనతార నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, సంగీతం : ఎస్ థమన్.