దామరచర్ల, డిసెంబర్ 29 : దామరచర్ల మండల విద్యాధికారిగా కేతావత్ సైదానాయక్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం తెలుగు పాఠశాల సముదాయ భాషోపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ భాషోపాధ్యాయులు రామావత్ లాలు, గుడిపాటి కోటయ్య, ధనావత్ సీతారాములు మాట్లాడుతూ.. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్న సైదానాయక్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించడం తెలుగు కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు సంతోషకరమని అన్నారు. ఎంఈఓ సైదా నాయక్ మాట్లాడుతూ.. తెలుగు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు భాషా బోధనలో మెలకువలను విద్యార్థులకు నేర్పించి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాషోపాధ్యాయులు జయరాజు, జానయ్య, భగవాన్, శ్రీనివాస్, కోట నాయక్, మక్లా, రాజశేఖర్ రాము, మంగమ్మ నాగమణి, జ్యోతి, జయమ్మ, రాధ, విజయ, పద్మ, లక్ష్మీబాయి, రత్నప్రభ, నరసింహ, నీల్యా పాల్గొన్నారు.