Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ స్టార్డమ్ మరో స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌ను వెండితెరపై చూసి చాలా కాలమే గడిచిపోయింది.చివరిసారిగా ‘డార్లింగ్’ చిత్రంలో ప్రభాస్ తన ఫన్ యాంగిల్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత, మళ్లీ అదే స్థాయిలో కామెడీ ఎంటర్టైన్మెంట్తో ప్రభాస్ కనిపించనున్నాడనే టాక్‌తో ‘రాజా సాబ్’పై అంచనాలు భారీగా పెరిగాయి.
పండగ సీజన్లో విడుదల కావడంతో ఈ సినిమా ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మారుతి కుమార్తె హియా దాసరి, ఈవెంట్లో ప్రభాస్‌ను పలకరిస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ కూర్చుని ఉండగా వెనుక నుంచి వచ్చిన హియాను ఆయన ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని మాట్లాడిన తీరు అభిమానుల మనసులను గెలుచుకుంది. ఈ మధురమైన క్షణాలను హియా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “హీరో గారు… మీరు నిజంగా ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీనిపై దర్శకుడు మారుతి కూడా లవ్ ఎమోజీలతో రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ పోస్ట్‌పై స్పందించడం విశేషం.
‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫన్, రొమాన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రభాస్ అభిమానులకు నిజమైన పండగ కానుక అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… ‘డార్లింగ్’ తర్వాత ప్రభాస్ కామెడీ మ్యాజిక్‌ను ‘రాజా సాబ్’ ఎంత స్థాయిలో రిపీట్ చేస్తాడనేది చూడాలి.