Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన తన ప్రేయసి కావ్యా రెడ్డిను వివాహమాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఏప్రిల్ 29 రాత్రి 11.05 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేసి కావ్యా రెడ్డిని జీవిత భాగస్వామిగా అంగీకరించారు. సంప్రదాయ వేద పద్ధతిలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మల్లు భట్టి విక్రమార్క, బి.ఆర్. నాయుడు వంటి ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించారు.
పెళ్లి అనంతరం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వధూవరులు ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మెరవనున్నారని తెలుస్తోంది.కావ్యా రెడ్డి సినిమా రంగానికి చెందిన వారు కాకపోయినా, ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందినవారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
హిందూ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి వెళ్లేముందు పేర్లు చెప్పే సంప్రదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పేర్లు చెప్పారు. ముందుగా కొత్త కోడలు.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని కావ్య రెడ్డి క్యూట్ గా చెప్పింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ..‘‘మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి’’ అని అంటాడు. సరిగ్గా చెప్పాలని అందరూ అడుగుతారు. అప్పుడు కావ్య రెడ్డి తన భర్తను ‘చెప్పు శ్రీని’ అని అడుగుతుంది. అప్పుడు నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను. అల్లుడు శీనుగా వచ్చా’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
After wedding at Tirumala, the newlyweds #BellamkondaSreenivas and his wife Kavya have gracefully arrived at their home in Hyderabad, marking the beginning of a beautiful new chapter in their lives.❤️🔥✨@BSaiSreenivas pic.twitter.com/PvUQUqRgA0
— H A N U (@HanuNews) April 30, 2026