Raja Shivaji | బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే మంచి టాక్‌తో దూసుకుపోతుండగా తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. దీంతో సల్మాన్‌ను చూసిన అభిమానులు థియేటర్లలో ఈలలు, కేకలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అత్యంత నమ్మకమైన అంగరక్షకుడు, వీర యోధుడు జీవా మహల్ పాత్రలో సల్మాన్ ఖాన్ మెరిశారు. అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధంలో శివాజీ ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా జీవా మహల్‌కు చరిత్రలో గొప్ప పేరుంది. ఈ వీరోచితమైన పాత్రలో సల్మాన్‌ను చూడటం అభిమానులకు కన్నుల పండుగగా మారింది. కాషాయ తలపాగా ధరించి, చేతిలో కత్తి పట్టి సల్మాన్ ఇచ్చే ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది.
మరోవైపు ఈ పాత్ర వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ పంచుకుంటూ, తానే స్వయంగా వెళ్లి సల్మాన్‌ను అడగలేదని, ఒక పార్టీలో కలిసినప్పుడు ఈ సినిమా గురించి తెలిసిన సల్మాన్.. “నేను లేకుండా నువ్వు ఈ సినిమా ఎలా చేస్తావ్? ఖచ్చితంగా నాకు ఒక పాత్ర ఉండాల్సిందే” అని పట్టుబట్టి మరీ ఈ క్యామియో చేసినట్లు తెలిపారు. రితేష్ గత చిత్రాలు ‘లై భారీ’, ‘వేద్’ సినిమాల తరహాలోనే ఈ చిత్రంతోనూ సల్మాన్ తన స్నేహాన్ని చాటుకున్నారు. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో మరాఠీ, హిందీలో కూడా విడుదలైన ఈ సినిమాలో జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ వంటి దిగ్గజ తారాగణం నటించగా, అజయ్-అతుల్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సల్మాన్ ఖాన్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘రాజా శివాజీ’ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్‌గా మారింది.
Cameo aisa ki puri movie ek taraf, aur Bhai ki entry ek taraf. King of Bollywood for a reason! 👑#Salmankhan pic.twitter.com/UAzSVWQvMq
— Salman Khan fan 🔱🗿 (@NikajDey213087) April 30, 2026