Nepal Police AA23 | సరిహద్దులు దాటిన బన్నీ మేనియా.. అల్లు అర్జున్ ‘AA23’ మ్యూజిక్‌తో నేపాల్ పోలీసుల వార్నింగ్!
AA23 Bgm | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
Nepal Police Uses AA23 Bgm | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేవలం సామాన్య ప్రజలే కాకుండా, విదేశీ ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ఆయన సినిమాల పాపులారిటీని వాడుకుంటున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కొత్త సినిమా AA23 (లోకేష్ – అల్లు అర్జున్) కి సంబంధించిన గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను నేపాల్ పోలీసులు తమ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ఉపయోగించుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేపాల్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. ఇందులో ఒక బస్సు రోడ్డుపై రాంగ్ రూట్లో వస్తుంది. అయితే ఆ బస్సుకు చలాన్ వేసిన నేపాల్ పోలీసులు Every illegal action has Legal Reaction!! (ప్రతి చట్టవిరుద్ధమైన చర్యకు చట్టపరమైన స్పందన ఉంటుంది) అంటూ హెచ్చరించారు. రోడ్డు భద్రత, లైన్ డిసిప్లిన్ మరియు ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల ప్రజలను హెచ్చరించే ఉద్దేశంతో అల్లు అర్జున్ సినిమాలోని ఇంటెన్స్ మ్యూజిక్‌ను నేపథ్యంగా వాడారు.
గతంలో ‘పుష్ప’ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపాయో తెలిసిందే. ఇప్పుడు రాబోయే సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కూడా అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒక సామాజిక బాధ్యత కలిగిన సందేశాన్ని చేరవేయడానికి నేపాల్ పోలీస్ శాఖ అల్లు అర్జున్ సినిమా మ్యూజిక్‌ని ఎంచుకోవడం గర్వకారణమని తెలుగు ప్రేక్షకులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
Every illegal action has Legal Reaction !!#NepalPolice #drivesafely #lanediscipline #trafficviolation pic.twitter.com/ETZ9CUKQPF
— Nepal Police (@NepalPoliceHQ) April 30, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

