హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో వైద్యులు తెలిపారు. శనివారం అపోలో ఆసుపత్రి వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. ఈ నెల 11న రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఆదివారం సాయిధరమ్‌తేజ్‌కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు.
#SaiDharamTej is out of ventilator support.
— BA Raju's Team (@baraju_SuperHit) September 18, 2021
Latest Health Bulletin from Apollo Hospitals.#GetWellSoonSDT pic.twitter.com/fGjeYjxO75