RX 100 Sequel | చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా కొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు దర్శకుడు అజయ్ భూపతి. ఇందులో హీరోయిన్ని విలన్‌గా చూపించి ప్రేక్షకులకి సరికొత్త మజా అందించాడు. ఈ సినిమాతోనే పాయల్ రాజ్‌పుత్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. సినిమాలో అమ్మడు రొమాన్స్, గ్లామర్ షో మాములుగా లేదు. ఆర్ఎక్స్ 100 మూవీ స్టోరీ నిజ జీవితంలో జరిగిన కథే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎటాక్ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన శిష్యుడైన అజయ్ భూపతిని ఓ అమ్మాయి ప్రేమిస్తున్నానని చెప్పి.. ఆ తర్వాత మోసం చేసిందట.
అప్పుడు బాధలో ఉన్న అజయ్ ఎటాక్ సినిమాపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయారట. ఇలాంటి బాధ చాలా తక్కువ మందికి కలుగుతుంది. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి.. దానినే ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకో అని ఎవరో చెప్పడంతో కొన్ని రోజులకు తన లవ్ ఫెయిల్యూర్ కథనే సినిమా స్టోరీగా రాసుకున్నాడట. విజయ్ దేవరకొండ, నవీన్ చంద్రలలో ఎవరో ఒక హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు కాని వర్కవుట్ కాలేదు. దాంతో కార్తికేయని హీరోగా తీసుకున్నాడు. ఇక తొలి పార్ట్ మంచి విజయం సాధించడంతో అజయ్ భూపతి ఆరెక్స్ 100 సీక్వెల్ ని చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తుంది.
మంగళవారం 2 కథ రెడీ చేసే ప్రయత్నంలో తనకు మొదటి హిట్ ఇచ్చిన ఆరెక్స్ 100 సీక్వెల్ కథ కూడా రాయాలని భావిస్తున్నాడట. ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కి పాయల్ రెడీగా ఉన్నా కార్తికేయ అంత ఆసక్తి చూపడం లేదట.అయితే కార్తికేయ, పాయల్ తో మరో కథ చేస్తూ దానికి ఈ సీక్వెల్ టైటిల్ పెట్టినా కూడా జనాలు ఒకే అనేలా ఉన్నారు. ప్రస్తుతానికి అజయ్ భూపతి మంగళవారం సినిమా సీక్వెల్ కథను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆరెక్స్ 100 సీక్వెల్ చేస్తాడా లేదా మరో కథ తీస్తాడా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.