ముంబై, జూలై 16: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకూ క్షీణిస్తున్నది. గురువారం మరో 17 పైసలు పడిపోయి 96.42 వద్ద ముగిసింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో 104 పైసలు లేదా 1.5 శాతం దిగజారినైట్టెంది.
ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, పెరుగుతున్న దేశీయ దిగుమతుల భారం వంటివి డాలర్ డిమాండ్‌ను పెంచితే, రూపీని అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఉదయం 96.28 వద్ద మొదలవగా, ఒకానొక దశలో 96.22కు లాభపడింది.