NTR | ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కన్నడ భామల హవా స్పష్టంగా కనిపిస్తోంది. రష్మిక మందానా బ్లాక్బస్టర్లతో దూసుకుపోతుంటే, నభా నటేష్, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి యాక్ట్రెస్‌లు కాస్త వెనకబడ్డారు. ఇక ఆషిక రంగనాథ్‌కు తెలుగులో అవకాశాలు వచ్చిన హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘విశ్వంభర’ మీదే ఉన్నాయి. ఇక ఈ పోటీలో మరో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ చేరింది. 2019లో ‘బీర్బల్’ సినిమాతో కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణీకి నిజమైన గుర్తింపు మాత్రం 2023లో వచ్చిన క్లాసిక్ లవ్‌స్టోరి ‘సప్త సాగరాలు దాటి’ తో వచ్చింది. ఇందులో ఆమె నటన, ఎమోషనల్ స్క్రీన్ ప్రెజెన్స్, క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌ను పూర్తిగా మలిచేసింది.
ఈ సినిమా నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది. ఒక దశలో నటిగా నేను సెట్ అవుతానా లేదా అనే డైలమాలో ఉన్నాను. కానీ ‘సప్త సాగరాలు దాటి’ వల్ల నా జీవితం మారిపోయింది,” అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.రుక్మిణీ వసంత్ తెలుగులో నిఖిల్ సరసన నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయినప్పటికీ, రుక్మిణీకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ లో హీరోయిన్గా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ విషయంకి సంబంధించి ప్రచారాలు జరుగుతుండగా, తాజాగా ఈ విషయాన్ని మదరాసి చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ కన్ఫాం చేశారు.
సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ చిత్రానికి ఆమె రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోందన్న టాక్ ఫిలింనగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఆమె యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండడం, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో, ఆమె అడిగినంత రెమ్యునరేషన్‌కు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, తమిళ స్టార్ శివకార్తికేయన్ సరసన ‘మదరాసి’ అనే చిత్రంలో నటించిన రుక్మిణీ, కాంతార 2 చిత్రంలో కూడా నటిస్తుంది. అలానే టాక్సిక్లోను ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తుంది. చూస్తుంటే రానున్న రోజులలో ఈ ముద్దుగుమ్మ హవా ఓ రేంజ్లో ఉండనుందని అర్ధమవుతుంది.