మహిళల రక్షణకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తక్షణ రక్షణ కోసం 9440970000 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుంచి ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన ట్వీట్ చేశారు.