Microsoft Job | మార్కుల కోసం వెంటపడకండి. నాలెడ్జ్‌ను, నైపుణ్యాన్ని పెంచుకోండి. అని చెప్పకనే చెబుతున్నాడు తక్కువ సీజీపీఏ (Cumulative Grade Point Average)తోనూ ఎక్కువ జీతంతో ఉద్యోగం సాధించిన విద్యార్థి. అతడి పేరే ఆదిత్య జమ్వాల్. అతడు తక్కువ సీజీపీఏ ఉన్నా రూ. 32 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ సంపాదించిన విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఇదే పోస్టులో 9.2 సీజీపీఏ ఉన్న విద్యార్థికి రూ. 6 లక్షలతో ఉద్యోగం లభించిన విషయాన్ని కూడా వెల్లడించాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది మార్కులు కొలమానం కాదు జ్ఞానమే అని.
ఆదిత్య నోయిడాలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ (Computer Science Engineering) పూర్తి చేశాడు. 6.8 సీజీపీఏతో ఈ డిగ్రీ పట్టా అందుకుని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. చదివే రోజుల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టాను. ఇందుకు సుమారు 50 డేటా స్ట్రక్చర్లు, అల్గారిథమ్‌ల మోడల్స్‌పై ఫోకస్ చేసి ఒక ప్రాజెక్టును డెవలప్ చేశాను. ఆపరేటర్ సిస్టమ్, డేటాబేసెస్, కంప్యూటర్ నెట్‌వర్క్స్‌పై అవగాహనను మెరుగుపరుచుకునేందుకు లో లెవల్ సిస్టమ్ డిజైన్లపై కూడా అధ్యయనం చేశాను. టెక్నికల్ ఇంటర్వ్యూల కోసం జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్ నేర్చుకున్నాను అని చెబుతూ మార్కుల వెంట పడకండి. నాలెడ్జ్‌ను జయించండి అని పోస్టును ముగించాడు.
అతడి పోస్ట్ విద్యాపరమైన ప్రతిభతో పాటు జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈరోజుల్లో ఎక్కువగా మార్కులు పెంచుకోవడంపైనే దృష్టిపెడుతున్నారు. ఎందుకంటే ఉన్నత విద్య, స్కాలర్షిప్, ఉద్యోగావకాశాల కోసం మార్కులు కొలమానంగా నిలుస్తున్నాయని. దీంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌పై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేస్తుంది తక్కువ సీజీపీఏకు ఎక్కువ జీతం, ఎక్కువ సీజీపీకు తక్కువ జీతం కథనం.