తిరుమల : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన తుమ్మల ఆనంద్ బాబు అనే భక్తుడు టీటీడీ ( TTD ) వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ( Pranadana Trust ) కు శనివారం రూ.10,11,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామ కృష్ణకు విరాళం డీడీని అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు భక్తులు క్యూలైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శుక్రవారం స్వామివారిని 78,445 మంది భక్తులు దర్శించుకోగా 40,098 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.30 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 4.16 లక్షల మందికి లడ్డూలను విక్రయించగా 3.30లక్షల మందికి అన్న ప్రసాదం అందజేశామని వెల్లడించారు.