రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ నెల 16న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు.
ఈ క్రమంలో ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో రోషన్ నటన ఆకట్టుకున్నది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయని, ఈ నెల 16న విడుదల కానున్న ట్రైలర్.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతుందని మేకర్స్ చెబుతున్నారు. నందమూరి కల్యాణ్‌చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ మధీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, కళ: తోట తరణి, సమర్పణ: జీ స్టూడియోస్.