జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం ‘విచిత్ర’. రవి రావణ్ రుద్ర, శ్రేయ తివారి, బేబీ శ్రీహర్షిణి, మీనావాసు ప్రత్యేక పాత్రధారులు. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. దర్శక,నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ‘తల్లీ, కూతుళ్లు అనురాగమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ఇది.
తల్లిప్రేమ, త్యాగం, బంధం గురించి ఈ సినిమాలో చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ చిత్ర కథ, కథనాలు సాగుతాయి. కొత్త సంవత్సరంలో సినిమాను విడుదల చేస్తాం.’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నిజాని అంజన్, నిర్మాణం: సిస్ ఫిల్మ్స్.