Rocky Aur Rani ki Prem Kahani Movie On Ott | బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhat) కాంబోలో 2019లో వచ్చిన గల్లీ భాయ్ (Gully boy) సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’(Rocky Aur Rani Kii Prem Kahaani). అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్ జోహర్ (Karan johar) దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత కరణ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. ఇక జూలై 28న విడుదలైన ఈ చిత్రం మంచి మౌత్ టాక్తో 300 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ ప్రియులు తెగ వేయిట్ చేశారు. అయితే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ తీసుకున్న విషయం తెలిసిందే. పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా అందుబాటులో ఉంచింది. అంటే ఈ సినిమా చూడాలంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అదనంగా రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్క సారి రెంట్ తీసుకుంటే కేవలం 48గంటల్లోపే సినిమాను చూసే చాన్స్ ఉంటుంది. అయితే ఈ పద్ధతిని అమెజాన్ ప్రైమ్ తీసేసి ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఇక ఫ్రీగా చూడాలి అనుకున్నవారు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది.
love is here to take over in its most dramatic form! 💗💅#RRKPKonPrime, watch now https://t.co/TU6iqWby7y@RanveerOfficial @aliaa08 #KaranJohar @aapkadharam #JayaBachchan @azmishabana @apoorvamehta18 @andhareajit @ishita_moitra #ShashankKhaitan #SumitRoy @somenmishra0… pic.twitter.com/unSG7PmxhB
— prime video IN (@PrimeVideoIN) September 21, 2023
Certain prem kahaanis are meant to last forever!💖 #RRKPKonPrime – watch now!https://t.co/P6cUyevjLa#RockyAurRaniKiiPremKahaani @RanveerOfficial @aliaa08 pic.twitter.com/ZmOu4cNkyP
— Dharma Productions (@DharmaMovies) September 22, 2023
ఇక కరణ్ బాలీవుడ్లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా కొన్నేళ్లుగా మెగాఫోన్కు కూడా దూరంగా ఉన్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి మెగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.