e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News నయాలుక్‌ అభివృద్ధి బాటన వరంగల్‌

నయాలుక్‌ అభివృద్ధి బాటన వరంగల్‌

  • 16 ప్రధాన రహదారులకు సుమారు రూ.191 కోట్ల నిధుల మంజూరు
  • విడుతల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులు
  • విస్తరణ, అండర్‌ డ్రైనేజీ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటు
  • కొత్త అందాలు సంతరించుకుంటున్న చారిత్రక నగరి
  • ఎమ్మెల్యే నన్నపునేని చొరవ పనుల పురోగతిపై సమీక్షలు

చారిత్రక వరంగల్‌ నగరం అభివృద్ధి బాట పట్టింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వరంగల్‌ కేంద్రంగా జిల్లాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ఇక్కడి రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం సుమారు రూ.191 కోట్లు మంజూరు చేసింది. దీంతో రోడ్ల డెవలప్‌మెంట్‌ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రహదారుల విస్తరణ, అండర్‌ డ్రైనేజీ, పైపులైన్‌, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ట్రాక్‌లు, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ తదితర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు అద్దంలా తయారవుతుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ చొరవతో ప్రజల కల సాకారం అవుతున్నది.

వరంగల్‌, డిసెంబర్‌ 6(నమస్తేతెలంగాణ) : వరంగల్‌ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్‌ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కూడా మంజూరు చేస్తున్నారు. ఈక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆ నిధులతో ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయిస్తున్నారు. గ్రేటర్‌ మేయరుగా పనిచేసిన సమయంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే న న్నపునేని నరేందర్‌ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి చేయాల్సిన ప్రధాన రోడ్లను గుర్తించారు. వీటి అభివృద్ధికి అప్పట్లోనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపా రు. దాదాపు 16 రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం సు మారు రూ.191 కోట్లు మంజూరు చేసింది.

- Advertisement -

స్మార్ట్‌ సిటీ నిధుల నుంచి ఇక్కడ ప్రతిపాదిత రహదారులను రెండు విడుతల్లో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ప్ర భుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు లభించినప్పటి నుంచి ఈ రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. సమస్యలను రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి రోడ్ల పనులు ఆటంకం లేకుండా జరిగేందుకు మార్గం సుగమం చేశా రు. ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇప్పటికే తొలి విడుత పనులు చేపట్టారు. రోడ్ల విస్తరణ, అండర్‌ డ్రైనేజీ, పైపులైన్‌, ఫుట్‌పాత్‌, డివైడ ర్లు, రహదారుల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు.

నిధులు మంజూరైన రోడ్లు ఇవే..

వరంగల్‌లో ప్రధాన రహదారులకు స్మార్ట్‌ సిటీ నిధు లు మంజూరయ్యాయి. ఎంజీఎం దవాఖాన నుంచి వెంకట్రామ థియేటర్‌ వరకు 2.50కిమీ రోడ్డుకు రూ.16.25 కోట్లు, వెంకట్రామ థియేటర్‌ నుంచి లేబర్‌కాలనీ వరకు 1.47 కిమీ రోడ్డుకు రూ.7.80, వెంకట్రామ థియేటర్‌ నుంచి హెడ్‌పోస్టాఫీస్‌ వరకు 1.10కి మీ రోడ్డుకు రూ.8.37, రైల్వేస్టేషన్‌ నుంచి రాంకీ ఎన్‌క్లేవ్‌ వరకు 260 మీటర్ల రోడ్డుకు రూ.2.53 కోట్లు, పోచమ్మమైదాన్‌ నుంచి వరంగల్‌చౌరస్తా వరకు 1.28 కిమీ రోడ్డుకు రూ.4.64, వరంగల్‌ చౌరస్తా నుంచి హెడ్‌పోస్టాఫీస్‌ వరకు 350 మీటర్ల రోడ్డుకు రూ.2.04 కోట్లు, వరంగల్‌ చౌరస్తా నుంచి ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు 200 మీటర్ల రోడ్డుకు రూ.11 లక్షలు, ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం దవాఖాన వరకు 1.30కిమీ రోడ్డుకు రూ.6.50 కోట్లను ప్రభుత్వం మం జూరు చేసింది.

ఈ రోడ్లన్నీ తొలివిడుత జాబితాలో ఉన్నాయి. రెండో విడుత ఫోర్ట్‌రోడ్డు నుంచి నాయుడు పెట్రోల్‌ బంకు వరకు 2.41కిమీ రోడ్డుకు రూ.15.69 కోట్లు, వాటర్‌ ట్యాంక్‌ శివనగర్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వ రకు 700 మీటర్ల రోడ్డుకు రూ.4.73, పల్లవి హాస్పిటల్‌ వద్ద 550 మీటర్ల రోడ్డుకు రూ.4.06 కోట్లు, ఆర్‌యూ బీ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు 470మీటర్ల రోడ్డుకు రూ.3.68 కోట్లు, సీకేఎం నుంచి లేబర్‌కాలనీ వరకు 3.76కిమీ రోడ్డుకు రూ.38.85 కోట్లు మంజూరయ్యా యి. వరంగల్‌ చౌరస్తా నుంచి హెడ్‌పోస్టాఫీస్‌ వరకు 350 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రారంభించారు. దీంతో ఇక్కడ యాభై అడుగుల వెడల్పు, పది ఇంచుల మందంతో సీసీరోడ్డు, 0.75 మీటర్ల వెడల్పు తో డివైడర్‌తో పాటు రెండువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మిం చే పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణం కూడా జరుగనుంది.

వరద ముంపు తప్పినట్లే.. – పీ మాధవి, గృహిణి, వరంగల్‌ స్టేషన్‌ రోడ్‌

చాలా ఏళ్లుగా వర్షం నీరు వరద రూపంలో రోడ్డుపై పారడం, ఇంటి ముందు నిలవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మార్కెట్‌ నుంచి వరదలో కొట్టుకు వచ్చిన చెత్త కారణంగా ఇంటి అవసరాలకు బయటకు వెళ్లలేకపోయేవాళ్లం. ఇన్నాళ్లకు భారీ పైపులతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించి, రోడ్డు విస్తరించడంతో పాటు వరద నీరు రోడ్డు మీదకు రాకుండా అధికారులు చేపట్టిన చర్యలు బాగున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

కొత్త లుక్‌ వచ్చేలా అభివృద్ధి…- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌ వ్యాపార కేంద్రం. వివిధ అవసరాల కోసం ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. రద్దీ ప్రాంతం. ఒకప్పుడు రోడ్లన్నీ కొంత ఇబ్బందికరంగా ఉండేవి. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడేది. నేను మేయర్‌గా ఉన్నప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎమ్మెల్యేగా పూర్తి చేశాను. రూ.191 కోట్లతో ఇక్కడ 16 ప్రధాన రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణంతో వరద సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. భవిష్యత్‌లో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో జిల్లా మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నా. వరంగల్‌కు ఒక కొత్త లుక్‌ వచ్చేలా అభివృద్ధి పనులు ఉంటాయి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement