ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 22న విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. ఇందులో రిషబ్ శెట్టి వివిధ అంశాలపై స్పందించగా, ఒక వివాదాస్పద పోస్టర్ చర్చకు తెరలేపింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఓ పోస్టర్లో, “కాంతార సినిమాను చూడటానికి వచ్చే వారు మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు” అనే వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచారం కావడంతో దానికి సంబంధించి రిషబ్ శెట్టిని విలేకరులు ప్రశ్నించారు.
అది పూర్తిగా నకిలీ పోస్టర్. మా ప్రొడక్షన్ హౌస్‌కు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో కావాలనే నకిలీగా తయారుచేసిన పోస్టర్ అది. మా దృష్టికి వచ్చిన వెంటనే వారు తొలగించి క్షమాపణలు చెప్పారు అని వివరించారు. ఈ విషయాన్ని కొంత మంది తప్పుడు దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పిన రిషబ్ శెట్టి, “ప్రతి ఒక్కరికి వారి ఆహార అలవాట్లు, జీవనశైలి ఉంటాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సినిమా ఓ ట్రెండ్‌గా మారినప్పుడు, కొందరు తమ స్వంత ఆలోచనలతో వాటిని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో వైరలవ్వాలన్నదే వారి ఉద్దేశం అన్నారు. సినిమా ప్రారంభంలో చాలా మంది కొన్ని ప్రతిజ్ఞలు చేశారని పోస్టర్స్ బయటకు వచ్చాయి.అందులో టీమ్ అంతా మద్యం, ధూమపానానికి దూరంగా ఉండనున్నట్టు రాసి ఉంది. వాటిపై కూడా రిషబ్ శెట్టి క్లారిటీ ఇస్తూ ఫేక్ అని కొట్టి పడేశారు.
ఇక షూటింగ్ సమయంలో తాను నాలుగు సార్లు ప్రమాదం బారిన పడ్డట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను చనిపోయేవాడినని, ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఆయన వల్లే ఈ సినిమా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా ముగిసింది అని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించి అసలైన స్టఫ్ దాచిపెట్టరేమో అనే అనుమానం కొందరిలో కలుగుతుంది.