న్యూయార్క్: గర్భిణీ స్త్రీలు పెయిన్ కిల్లర్ టైలినాల్ వాడవద్దు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు. టైలినాల్ వాడకం వల్ల ఆటిజం పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. టైలినాల్ వల్లే అమెరికాలో ఆటిజం కేసులు పెరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. టైలినాల్కు, ఆటిజంకు లింకు ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నా.. ఆ అంశంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సోమవారం వైట్‌హౌజ్ నుంచి ఆయన ప్రసంగించారు. మహిళలు అసిటమినోఫిన్ డ్రగ్‌ను వాడవద్దు అని ట్రంప్ పేర్కొన్నారు. టైలినాల్ బ్రాండ్ పేరుతో అమ్మే ఆ మందును ప్రెగ్నెన్సీ సమయంలో పూర్తిగా వాడకూడదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ల పట్ల కూడా ట్రంప్ కొంత ఆందోళన వ్యక్తం చేశారు.
టైలినాల్ను ఇతర దేశాల్లో పారాసిటమాల్ మందుతో పోల్చుతారు. కానీ ఆ డ్రగ్ వల్ల ఆటిజం వస్తుందనడానికి ఆధారాలు లేవని కొందరు నిపుణులు అంటున్నారు. తొందరలోనే అమెరికా డాక్టర్లు ఇక టైలినాల్ పెయిన్ కిల్లర్‌ను సూచించరు అని ట్రంప్ తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కూడా ప్రకటన సమయంలో ఉన్నారు. అసిటమినోఫెన్ ఉన్న ఆ మందును కేవలం జ్వరం వచ్చిన సందర్భంలోనే మాత్రమే తీసుకోవాలని ట్రంప్ తన ప్రకటనలో సూచించారు.
🚨 BREAKING: President Trump just announced a link between TYLENOL and AUTISM — especially when taken during pregnancy
FDA is now recommending pregnant women don’t take Tylenol except in cases of extremely high fevers
Nor should Tylenol be frequently administered to young… pic.twitter.com/odBhSl7pgZ
— Nick Sortor (@nicksortor) September 22, 2025