న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐపీఎల్లో రింకూ సింగ్(Rinku Singh) స్టార్ ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియా జట్టు తరపున టీ20ల్లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఫినిషింగ్‌లో బలమైన షాట్లతో అలరిస్తున్న రింకూ సింగ్.. యూపీలో జరుగుతున్న టీ20 లీగ్‌లోనూ దుమ్మురేపాడు. మీరట్ మావరిక్స్ తరపున ఆడిన అతను.. కాశీ రుద్రాస్ జట్టుపై చెలరేగిపోయాడు. సూపర్ ఓవర్లో 17 రన్స్ అవరసంగా కాగా, రింకూ ఆ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి తన సత్తా చాటాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివా సింగ్ వేసిన ఓవర్లో రింకూ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
Palak na jhapke 😴 nahin toh miss hojayenge #RinkuSingh 🔥 ke zabardast 6⃣6⃣6⃣#AbMachegaBawaal #JioUPT20 #UPT20onJioCinema pic.twitter.com/vrZuMqPn9D
— JioCinema (@JioCinema) August 31, 2023
తొలుత రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయ్యింది. నిర్ణీత ఓవర్లలో రెండు జట్లూ 181 రన్స్ చేశాయి. అయితే ఒక సూపర్ ఓవర్ లో మాత్రం రింకూ తన జూలు విదల్చాడు. నిజానికి మొదట మ్యాచ్‌లో 22 బంతుల్లో 15 రన్స్ మాత్రమే చేసిన అతను.. సూపర్ ఓవర్లో మాత్రం హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి హీరో అయ్యాడు.