1990 దశకంలో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘రిమ్జిమ్’. ‘అస్లీదమ్’ ట్యాగ్‌లైన్. అజయ్ వేద్, ప్రజన, రాహుల్ సిప్లిగంజ్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. హేమ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ కథాంశమిదని, 1990 దశకంలో హైదరాబాద్ జీవితానికి అద్దంపడుతుందని, రాహుల్ సిప్లిగంజ్ ఓ పాట పాడటంతో పాటు కీలక పాత్రలో నటించారని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు హేమ సుందర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండం, సంగీతం: కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమ సుందర్.