Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు రక్షణ వైమానిక శాఖ చైర్మన్, టెసరాక్ట్ కంపెనీ చైర్మన్, కొండల్ రెడ్డికి మెమొరీ లాస్ ఉందని.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదని కోర్టులో చెప్పారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ వెల్లడించారు.
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్ బీఆర్ ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తమ్ముళ్ల ఆస్తుల గురించి అసలు విషయం చెప్తా మీకు.. 2023లో బిజినెస్ స్టాండర్డ్ పేపర్లో వచ్చిన జాబితా ఇది.. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ ఒక నోటీస్ ఇచ్చింది. పేపర్లో ఎగవేతదారులది నోటీస్ ఎప్పుడొస్తది.. మొదట సమాచారమిస్తరు.. ఒకసారి ,రెండుసార్లు ఫోన్ చేస్తరు బ్యాంకుల వాళ్లు నువ్వు అప్పు తీసుకున్నవ్.. పైసలు కట్టు అంటరు. తర్వాత మెయిల్స్ వస్తది.. ఆ తర్వాత మనుషులను పంపుతరు.. ఆ తర్వాత ఇట్లా పేపర్లు వస్తయన్నారు.
అనుముల కొండల్ రెడ్డి ఇంటికి నోటీస్ పెట్టారు.. రూ.2.89 కోట్లు అప్పు తీసుకున్నవ్.. గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలోని 300 గజాల జాగా తనఖా పెట్టి రూ.2.89 కోట్లు అప్పు తీసుకున్నవ్.. ఎప్పుడిస్తవ్ వాపస్ అని హెచ్డీఎఫ్సీ ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసిందని మన్నె క్రిశాంక్ తెలిపారు. 2023లో మీరు తీసుకున్న రూ.2.89 కోట్లు అప్పు తీర్చడానికి డబ్బులు లేవు కానీ.. ఇవాళ మీరు 50 వేల కోట్ల ఆస్తులు ఎట్లా నిర్మాణం చేస్తరు.. ఎట్లా రక్షణ వైమానిక శాక చైర్మన్ అయిపోతవు.. ఎట్లా నీకు రూ.200 కోట్ల జాగాను ప్రభుత్వం ఇస్తది.. ఇంకా దారుణమేంటంటే.. ఇది 2025 కోర్టు డాక్యుమెంట్.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ అనుముల కొండల్ రెడ్డి బ్రదర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ ఆర్డర్ వచ్చింది 2025 నవంబర్ 26. ఈ కేసు ఏంటంటే..రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టేసి.. ఇన్‌కం ట్యాక్స్ కట్టకుండా కొన్ని సంవత్సరాలు దాటవేస్తుంటే.. ఆస్తులు పెరుగుతుంటే ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేసు వేశారు.
ఈ కేసు వేసినప్పుడు ఎందుకు కట్టలేదు.. ఎందుకు అప్పీలు చేయలేదని అంటే కారణం ఏం చెప్పారో తెలుసా..? రేవంత్ రెడ్డి తమ్ముడు రక్షణ వైమానిక శాఖ చైర్మన్, టెసరాక్ట్ కంపెనీ చైర్మన్, కొండల్ రెడ్డికి మెమొరీ లాస్ ఉందట..ఇది కోర్టులో చెప్పారు.. అందుకే కొన్ని సంవత్సరాలు ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట. అనుముల కొండల్ రెడ్డి మెడికవర్ ఆస్పత్రిలో కంటిన్యూగా ట్రీట్మెంట్లో ఉన్నారట . ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టారని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు
HDFC బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు
2025 నవంబర్ 26వ తేదీన ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్ రెడ్డిపై ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేశారు
అప్పుడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నాడు
అయితే, ఆ మెమరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది మెడికవర్ ఆసుపత్రి
ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టారు
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
మెమరీ లాస్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కోర్టుకు తెలిపిన అనుముల కొండల్ రెడ్డి
మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, అక్కడి డాక్టర్లు మెమరీ లాస్‌గా నిర్ధారించారని కోర్టుకు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత https://t.co/o9PPJjDpPQ
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

