Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Iodine tablets | ఇరాన్ సర్కారు (Iran Govt) ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు (Iodine tablets) పంచుతున్నది. యుద్ధరంగంలో ఉన్న తమకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియక ముందుజాగ్రత్త చర్యకు పూనుకుంది. అయితే యుద్ధానికి, అయోడిన్ టాబ్లెట్లకు సంబంధం ఏమిటని మీరు అనుమానిస్తున్నారా..? కానీ ఆ రెండింటికీ సంబంధం ఉన్నది.
Iodine tablets : ఇరాన్ సర్కారు (Iran Govt) ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు (Iodine tablets) పంచుతున్నది. యుద్ధరంగంలో ఉన్న తమకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియక ముందుజాగ్రత్త చర్యకు పూనుకుంది. అయితే యుద్ధానికి, అయోడిన్ టాబ్లెట్లకు సంబంధం ఏమిటని మీరు అనుమానిస్తున్నారా..? కానీ ఆ రెండింటికీ సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
యుద్ధంలో భాగంగా అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే మళ్లీ దాడులు చేస్తామని సంకేతాలు కూడా ఇస్తున్నది. అమెరికా మళ్లీ దాడులు గనుక చేస్తే ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అణుకేంద్రాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు జరిగినప్పుడు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నది. అయోడిన్ టాబ్లెట్లు యాంటీ రేడియేషన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే అణుకేంద్రాలకు సమీపంలోని ప్రజలకు ముందు జాగ్రత్తగా ఇరాన్ అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్నది.
అణు కేంద్రాలకు సమీపంలోని ప్రజలకు ముందుజాగ్రత్తగా తాము అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నామని, ట్రంప్‌ను నమ్మలేమని, ఆయన ఎప్పుడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఇరాన్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. ఇటీవల అమెరికాతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కూడా అణుస్థావరాల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు టెహ్రాన్ అయోడిన్ టాబ్లెట్లను పంచింది. రేడియేషన్ వల్ల థైరాయిడ్ కణాలు దెబ్బతింటాయి. దాంతో ఆ గ్రంథి పనితీరు మందగించి హార్మోన్లను సరిగా ఉత్పత్తి చేయదు.
అణు ప్రమాదాలవల్ల రేడియేషన్‌కు గురయ్యేవారు భవిష్యత్‌లో థైరాయిడ్ క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం జాతీయ భద్రతా బృందంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. ఇరాన్‌పై సైనికచర్య కొనసాగించాలా వద్దా..? అనే దానిపై చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్‌లోని పికాక్స్ పర్వత ప్రాంతంలో ఉన్న అణుకేంద్రంపై దాడి జరగవచ్చునన్న భయాలు నెలకొన్నాయి. అమావాస్య కావడంతో రాబోయే రెండు రోజుల్లో చంద్రుడి కాంతి తక్కువగా ఉంటుందని, అది దాడులు చేయడానికి అనుకూలమైన సమయమని ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇదిలావుంటే ఇరాన్ అణు కార్యక్రమం గురించి సమాచారం ఇచ్చిన వారికి అమెరికా సైన్యం భారీ రివార్డు ప్రకటించింది. 20 మిలియన్ డాలర్లు ఇస్తామని వెల్లడించింది. అలాగే వారికి పునరావాసం కల్పిస్తామని చెబుతున్నది. ఇరాన్‌లోని అణుకేంద్రాలు, పరికరాలు, సిబ్బంది, శాస్త్రవేత్తల గురించి సమాచారం ఇచ్చిన వారికి ‘రివార్డ్ ఫర్ జస్టిస్’ ప్రోగ్రామ్ కింద ఈ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు శుక్రవారం ఇరాన్‌పై పరిమిత స్థాయిలో అమెరికా దాడులు చేసింది. కొన్ని నిమిషాలపాటు ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేశామని ట్రంప్ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

