‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ.. మాటే మాణిక్యమాయెనే’ అంటూ పుష్పరాజే కాదు, టాలీవుడ్ ప్రేక్షకులూ
పరవశంగా పాడుకుంటున్నారు. ఎందుకంటే, సౌత్ నుంచి నార్త్ వెళ్లాక మస్తు బిజీ అయిపోయింది రష్మిక మందన్న.
పెద్దపెద్ద బ్యానర్లు, పేరున్న దర్శకులు, పాన్ ఇండియా హీరోలు.. అదో ప్రపంచం! కొన్నిసార్లు ఇదంతా తనకే నమ్మబుద్ధి కాదట! కలలను తలపించే ఆ నిజాల గురించి మనసువిప్పి చెప్పింది మందస్మిత రష్మిక మందన్న.
దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోతున్నది. ఆ అనూహ్య స్పందన వల్లే నాకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బీ సినిమాలు చూస్తూ పెరిగిన నేను.. ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నానంటే, అందుకు కారణం.. పుష్ప! జీవితంలో మరిచిపోలేని విజయాన్ని అందించింది ఆ చిత్రం. కన్నడ సీమ నుంచి ప్రారంభమైన నా ప్రస్థానం టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకూ వచ్చింది. విభిన్న భాషలు, సంస్కృతులు నాకెప్పుడూ అడ్డంకి కాలేదు. షూట్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటించడం, అక్కడివారితో మమేకంకావడం, కొత్త విషయాలు నేర్చుకోవడం… ఇలా ప్రతి మలుపునూ ఆస్వాదిస్తున్నా.
నా బాలీవుడ్ సినిమాలు ‘మిషన్ మంజు’,‘గుడ్‌బై’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో విజయ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన నేను సినిమా నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ఆ ఊహ కూడా రాలేదు. అయితేనేం, బాలీవుడ్ వరకూ రాగలిగాను. ముంబై నన్ను సాదరంగా ఆహ్వానించింది. ఇక్కడ ప్రతిభావంతులకే చోటు. సినీ ఇండస్ట్రీలో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ గుర్తింపు నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నది. పెట్టిపుట్టడం అంటే ఇదేనేమో!
పుష్ప టాలీవుడ్లో రికార్డులు బ్రేక్ చేస్తుందని తెలుసు కానీ.. ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. అందుకు మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆ విశేష ఆదరణతోనే నేను బాలీవుడ్‌కు రాగలిగాను. ఓ నటిగా నాకు ఎల్లలు లేవు. బాలీవుడ్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. నాకు ప్రేక్షకుల ప్రశంసలే అవార్డులు. ఎక్కడికి వెళ్లినా నా పాత్రల పేర్లతోనే పిలుస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
సినీ కెరీర్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకూ ఏటా ఏదో ఒక కమర్షియల్ హిట్ తప్పకుండా ఉంటున్నది. అది నా కష్టానికి ప్రతిఫలమని భావిస్తున్నా. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌కు వస్తున్నారు. సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. పరి
శ్రమకు పునర్జన్మ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అయితే, ఆన్లైన్లో ట్రోల్స్ బెడద పెరిగింది. అవేమీ నన్ను పెద్దగా ప్రభావితం చేయలేవు. నా పరిధిలో నేను సంతోషంగా, సానుకూలంగా జీవించాలని నాతో నేను ఒప్పందం చేసుకున్నా. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నా.
సినిమాల వల్ల ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా. అందుకే, ఎప్పుడు వీలు దొరికినా కూర్గ్‌లోని సొంతింటికి వెళ్తుంటా. అమ్మ, నాన్న, చెల్లి.. వాళ్లే నా ప్రపంచం. నా చెల్లెలు షిమ్మాన్ కూర్గ్‌లో ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నది. వచ్చేనెల తన బర్త్‌డే. షిమ్మాన్ నా సినిమాలను చాలా ఇష్టపడుతుంది. నా సినిమాల్లోని పాటలు పాడుతుంది. చక్కగా డ్యాన్స్ చేస్తుంది. మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందుకే తనను నా బిడ్డలా చూసుకుంటా. నా ప్రేమను పంచుతూ ఉంటా.
నా ఫిట్నెస్ జర్నీపై ఓ పుస్తకం రాయాలని ఉంది. వ్యాయామం విషయంలో చాలా కఠినంగా, క్రమశిక్షణగా ఉంటాను. ఎప్పుడూ కసరత్తుకు బ్రేక్ ఇవ్వను. కానీ, చాలామంది నేను జిమ్ చేస్తానంటే నమ్మరు. ఇష్టమైన రుచులు కనిపించగానే నోరూరిపోతుంది. అందులోనూ సరికొత్త వంట కాలను చూడగానే కంట్రోల్ తప్పుతాను. నన్ను నేను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా.
నా ఫిట్నెస్ జర్నీపై ఓ పుస్తకం రాయాలని ఉంది. వ్యాయామం విషయంలో చాలా కఠినంగా, క్రమశిక్షణగా ఉంటాను. ఎప్పుడూ కసరత్తుకు బ్రేక్ ఇవ్వను. కానీ, చాలామంది నేను జిమ్ చేస్తానంటే నమ్మరు. ఇష్టమైన రుచులు కనిపించగానే నోరూరిపోతుంది. అందులోనూ సరికొత్త వంటకాలను చూడగానే కంట్రోల్ తప్పుతాను. నన్ను నేను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా.
ఆందోళన కొందరిని బలహీనులను చేస్తుంది. మరికొందరిని దృఢంగా మారుస్తుంది. నేను రెండో రకం. భయం మొదలైనప్పుడే నాలోని కష్టపడే తత్వం బయటికొస్తుంది. ఆ భయాన్ని అధిగమించేందుకు మరింత కష్టపడతాను. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే.. వేరే పని మొదలుపెట్టను. ఒత్తిడి కలిగించిన అంశంపైనే దృష్టిపెట్టి ఆ పరిమితిని జయిస్తాను.