AI Headphone | హైదరాబాద్, మే 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పెళ్లిళ్లు, ఇతరత్రా కార్యక్రమాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ఫోన్‌ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ హెడ్‌ఫోన్‌ను ధరించి మనం ఎవరి మాటలనైతే వినాలనుకొంటున్నామో.. ఆ వ్యక్తి వైపునకు చూస్తూ.. అతను మాట్లాడేప్పుడు హెడ్‌ఫోన్ మీద ఉన్న బటన్‌ను నొక్కాలని పరిశోధకులు తెలిపారు. ఆ వ్యక్తి స్వరపేటిక శబ్ధాల పౌనఃపున్యాన్ని కంప్యూటర్లోని మెషిన్ లర్నింగ్ సాఫ్ట్వేర్ విశ్లేషించి.. ఆ వాయిస్‌ను మాత్రమే హెడ్‌ఫోన్‌కు పంపిస్తుందన్నారు. తద్వారా మిగతా వాయిస్‌లు, సౌండ్స్ ఏమీ వినబడవని పేర్కొన్నారు.