e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Home News టీయూలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితకు వినతి

టీయూలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితకు వినతి

నిజామాబాద్‌: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ సమస్యలు, అక్రమాలపై ఎమ్మెల్సీకి వివరించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా వీసీ బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ గుప్తా దాదాపు 130 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను అక్రమంగా భర్తీ చేశారని అన్నారు.

ఒక్కో వ్యక్తి వద్ద నుంచి రూ. 2 లక్షల నుంచి 3లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఇంత వరకు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే వీసీ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement