కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో ఉన్న చెరువును( Pond ) ఇతర గ్రామానికి ఇవ్వకుండా గ్రామ గంగపుత్రులకే అప్పగించాలని ధర్మారావుపేట గంగపుత్రులు (Gangaputras) కోరారు. గ్రామ గంగపుత్రులు ఎంపీడీవోతో కార్యాలయానికి భారీగా తరలివచ్చి వినతిపత్రం అందజేశారు.
ధర్మారావుపేటలో 150 మంది గంగ పుత్రుల కుటుంబాలు గ్రామ చెరువులో చేపలు పెంచి వాటిని విక్రయిస్తూ జీవనాధారం పొందుతున్నామన్నారు. ధర్మారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువును లంబాడీతండా (డీ) గ్రామ పంచాయతీకి చెందిన కొంత మంది అక్రమంగా ఇతరులకు అప్పగించి, చెరువు వద్దకు గంగపుత్రులను రాకుండా అడ్డుకొని జీవన ఆధారం లేకుండా చేస్తున్నారని మండి పడ్డారు. చెరువు ఆక్రమణకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.