జీపీల్లో పైసల్లేవ్..!
గ్రామ పంచాయతీల్లో పైసల్లేకుండా పోయా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో జీపీల్లో ఖజానా ఖాళీగా ఉంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.
- జనవరి నుంచి విడుదల కానీ ఎస్ఎఫ్సీ, ఎఫ్ఎఫ్సీ నిధులు
- పంచాయతీ కార్మికులకు నెలల తరబడి అందని వేతనాలు
- పేరుకుపోతున్న ట్రాక్టర్ కిస్తీలు
- ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శులు
మెదక్, జూలై 13 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో పైసల్లేకుండా పోయా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో జీపీల్లో ఖజానా ఖాళీగా ఉంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. సర్పంచ్ల పద వీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆదాయం కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను మినహాయిస్తే చిన్న గ్రామ పంచాయతీల్లో పాలన పంచాయతీ కార్యదర్శులకు పెను భారంగా మారుతోంది. అత్యవసరమైన పారిశుధ్యం, తాగునీటి అవసరాల కోసం కార్యదర్శులు తమ జేబుల నుంచి డబ్బులను సర్ధుబాటు చేస్తున్నప్పటికీ నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వారు కూడా చేతులెత్తేస్తున్నారు.
గడువుకు ముందే ఖజానా ఖాళీ…
సర్పంచ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. అయితే తమకు రావాల్సిన బిల్లులకు సంబంధించి ఖజానాలో ఉన్న డబ్బులను సర్పంచ్లు ఖాళీ చేశారు. సాధారణంగా పంచాయతీల్లో పన్నులను మార్చి నెలాఖరులో వసూలు చేస్తారు. పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండటంతో మెజార్టీ గ్రామాల్లో ఈసారి ముందుగానే పన్నులు వసూలు చేశారు. వచ్చిన పన్నులను పంచాయతీ అవసరాలకు ఖర్చుచేశారు. కొంత మంది సర్పంచ్లు పంచాయతీ అవసరాల కోసం వెచ్చించిన సామగ్రికి సంబంధించి బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారు. మరికొందరి బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉండడంతో ట్రెజరీ చుట్టూ తిరుగుతున్నారు. గ్రామ పం చాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించినప్పటికీ వారు వారంలో ఒక సారి కూడా జీపీలను సందర్శించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పంచాయతీల్లో బాధ్యత మొత్తం కార్యదర్శులపై పడుతోంది.
పల్లెపాలనకు ఇబ్బందులు
మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ఆదాయం కలిగిన కొన్ని పంచాయతీలను మినహాయిస్తే 500లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పాలనకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్న గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు మూడు, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నీటి సరఫరా, పారిశుధ్య కార్మికులు పను లు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. పంచాయతీల్లో వీధిదీపాల బిల్లుల చెల్లింపు, తాగునీటి పథకాల నిర్వహణ, మోటార్ల మరమ్మతు వంటివి అత్యవసర పనుల కోసం కూడా కార్యదర్శులు సర్ధుబాటు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు ఒక్కో గ్రామ పంచాయతీలో రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే రూ.5 లక్షల వరకు వివిధ పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ప్రతి నెలా రూ.8 కోట్ల నిధులు విడుదల
జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. వీటికి రాష్ట్ర ఆర్థిక సం ఘం నిధులను(ఎస్ఎఫ్సీ) ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేసేది. కేంద్రానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు (ఎఫ్ఎఫ్సీ) ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసేది. ఐదు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. దీంతో పంచాయతీల్లో ఎలాంటి పనులు చేపట్టలేని పరిస్థితి దాపురించింది.
బకాయిలు ఉన్నది వాస్తవమే..
పంచాయతీ కార్మికులకు వేతన బకాయిలు ఉన్న మాట వాస్తవమే. జనవరి నుంచి జూన్ వరకు నిధులు విడుదల కాలేదు. రోజూ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలకు రూ.8 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. ఐదు నెలలుగా నిధులు విడుదల కాక పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – యాదయ్య, డీపీవో మెదక్ జిల్లా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

