Basara RGUKT : బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
Basara RGUKT : బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల | బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం)కి ఎంపికైన విద్యార్థుల జాబితా గురువారం విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,404 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి వంద మంది విద్యార్థులకు ఎంపికయ్యారు. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా ఐదుగురు విద్యార్థులు

హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం)కి ఎంపికైన విద్యార్థుల జాబితా గురువారం విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,404 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి వంద మంది విద్యార్థులకు ఎంపికయ్యారు. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా ఐదుగురు విద్యార్థులు ఆర్జీయూకేటీలో సీట్లు సాధించారు. ఈ నెల ప్రారంభంలో ఆర్జీయూకేటీలో ప్రవేశానికి యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియను పదో తరగతిలో సాధించిన ఫలితాల (జీపీఏ) ఆధారంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం పాలిసెట్ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు. గతేడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా.. ఈ సారి సంఖ్యను కాస్త కుదించారు. సీట్ల కేటాయింపులో స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ ఉండగా.. మిగతా 15 శాతం సీట్లను మిగతా వారికి కేటాయిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

