Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Regina Cassandra | భారతీయ సినీ పరిశ్రమలో 'నార్త్ వర్సెస్ సౌత్' చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ప్రముఖ నటి రెజీనా కసాండ్రా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతీయ చర్చకు మళ్లీ తెరలేపాయి.
Regina Cassandra | భారతీయ సినీ పరిశ్రమలో ‘నార్త్ వర్సెస్ సౌత్’ చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ప్రముఖ నటి రెజీనా కసాండ్రా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతీయ చర్చకు మళ్లీ తెరలేపాయి. సౌత్ సినిమాపై ఉత్తరాది నటీనటులు చేసే విమర్శలను ఆమె తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు, హిందీ చిత్రసీమలో తనకు ఎదురైన చేదు అనుభవాలు, ప్రాంతీయ వివక్షను బయటపెట్టారు.
జాన్వీ కపూర్, రాధికా ఆప్టే వంటి బాలీవుడ్ నటులు ఇటీవల సౌత్ సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలపై రెజీనా స్పందిస్తూ.. ఉత్తరాది నటులు దక్షిణాది సినిమాల గురించి ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల ఇండస్ట్రీల మధ్య అనవసరమైన విభేదాలు వస్తాయని అన్నారు. సౌత్ సినిమాలలో నిజంగానే సమస్యలు ఉన్నాయని భావిస్తే, ఆ ప్రాజెక్ట్‌లలో నటించకుండా వారు ముందే ఎందుకు బయటకు వచ్చి ఉండకూడదని సూటిగా ప్రశ్నించారు.
కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, బాలీవుడ్లో తనకు ఎదురైన వివక్షను కూడా ఆమె పంచుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘కేసరి చాప్టర్ 2’లో తాను అక్షయ్ కుమార్ భార్యగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించినట్లు రెజీనా తెలిపారు. అయితే సినిమా ప్రమోషన్ల సమయానికి తన పట్ల జరిగిన తీరు తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రమోషన్లలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన పేరును తొలగించారని, తనపై వచ్చిన పాటను విడుదల చేసినా సోషల్ మీడియాలో కనీసం ట్యాగ్ చేయలేదని వాపోయారు. తాను సౌత్ ఇండియన్ నటి అనే కారణంతోనే తనపై ఈ వివక్ష చూపించారా అంటూ ఆమె బాలీవుడ్ తీరును నిలదీశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

